SAKSHITHA NEWS

కూసుమంచి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
కూసుమంచి పోలీస్ స్టేషన్, సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయాన్ని అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు సందర్శించారు.
పోలీస్ స్టేషన్ కు చేరుకున్న అడిషనల్ డీసీపీ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, సెక్టార్ అధికారుల విచారణ నివేదికలు, జనరల్‌ డైరీ రికార్డులను పరిసరాలను పరిశీలించారు. శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకొని తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. అప్పగించిన భాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ….పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలన్నారు. 5ఏస్ అమలులో భాగంగా పోలీస్ స్టేషన్లలో స్టేషనరీ విభాగం పరిశుభ్రంగా వుంచాలని అదేవిధంగా అవసరమైన రికార్డులు, వస్తువుల క్రమపద్ధతిలో పెట్టడం, పరిసరాలలో సురక్షితమైన ,ఆరోగ్యవంత
మైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొవాలన్నారు.

స్టేషన్
స్టేషన్ హౌస్ మేనేజ్‌మెంట్, పోలీస్ స్టేషన్ నిర్వహణ, సెక్టార్ ఆఫీసర్ల భాధ్యతలు, రెగ్యులర్ రోల్ కాల్ విధిగా అమలు చేయాలని సూచించారు. పెట్రో కార్, బీట్ డ్యూటీ సిబ్బంది ఏవిధమైన విధులు నిర్వహిస్తున్నారు? పాత నేరస్ధుల నివాసాలను కదలికలను ఏవిధంగా గుర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం ద్వారా కలిగే ఉపయోగాలను స్ధానికులు వివరించి స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు పెట్టుకొనే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.


SAKSHITHA NEWS