SAKSHITHA NEWS

నిత్యవసర ధరలు అదుపులో పాలకుల విఫలం
సెప్టెంబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి …… సిపిఐ పిలుపు

రేషన్ షాపుల్లో నిత్యవసర సరుకుల పంపిణీ కి డిమాండ్…… సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్

సాక్షిత వనపర్తి ఆగస్టు 31 నిత్యవసర సరుకుల ధరలను అదుపులో ఉంచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని జిల్లా కార్యవర్గ సభ్యులు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే శ్రీరామ్ విమర్శించారు జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బియ్యం పప్పు నూనె ల తోపాటు అన్ని రకాల నిత్యవసర సరుకుల ధరలను అదుపులో ఉంచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయని అవి ఎంతగా అంటే సామాన్యుడు కొనలేనంతగా పెరిగిపోయాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యవసర సరుకులను పేదలకు పంపిణీ చేసిందని కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటైన ప్రభుత్వాలు వాటికి పాతరేశాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా ఒక సరుకు కూడా ఇవ్వకపోవడంతో మార్కెట్లో నిత్యవసర సరుకులు ధరలు పెరిగిపోయి సామాన్యు లు వాటిని కొనలేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి ఏడు వరకు కలెక్టరేట్ల ముట్టడికి సిపిఐ పిలుపునివ్వడం జరిగిందని తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సెప్టెంబర్ 2న కలెక్టరేట్ల ముట్టడి కి పిలుపునివ్వడం జరిగిందని ఈ కార్యక్రమానికి నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమాఖ్య ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీ అధ్యక్షురాలు పి. కళావతమ్మ సిపిఐ పట్టణ కార్యదర్శి జై రమేష్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ పాన్గల్ మండల కమిటీ సభ్యుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS