రామగుండం పవర్ ప్రాజెక్టుపై సానుకూల నిర్ణయం తీసుకుంటాం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
సాక్షితపెద్దపల్లి జిల్లా:
పెద్దపల్లి జిల్లా రామగుండం లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించా రు.ఉదయం 10 గంటల 20 నిమిషాలకు రామగుండం పోలీస్ కమిషనరెట్ లోని హెలీప్యాడ్ వద్దకు భట్టి విక్రమార్క ,పొన్నం, శ్రీధర్ బాబు చేరుకున్నారు.
రామగుండంలోని తెలం గాణ జెన్కో నిర్మిస్తున్న 800 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ స్థలంను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పరిశీలిచా రు. తర్వాత ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ..
రామగుండం పవర్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి తో అనేకసార్లు చర్చించినట్లు తెలిపారు. 800 మెగా వాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు భట్టి తెలిపారు.. రామగుండం పవర్ ప్రాజెక్టు పై సానుకూల నిర్ణయం తీసుకుంటామని, బి పవర్ హౌస్ పవర్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని భట్టి విక్రమార్క ఈ సంద ర్భంగా తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో భట్టితో పాటు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర బీసి సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు..