సిపిఐ నాయకులు పఠాన్ జాన్ ఖాన్ మృతి
-కూనంనేని, బాగం, పోటు సహా పలువురి నివాళి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
సిపిఐ నాయకులు, ఖమ్మం నగరం హవేలీ ప్రాంత పార్టీ బాధ్యులు పఠాన్ జానాఖాన్ (65) గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. జానాఖాన్ స్వగ్రామం తల్లాడ మండలం పినపాకలో సిపిఐ గ్రామ కార్యదర్శిగా, పంచాయతీ పాలక వర్గ సభ్యులుగా పనిచేశారు. 25 ఏళ్ల క్రితం ఖమ్మంకు వలస వచ్చిన జానాఖాన్ సిపిఐ నాయకునిగా పనిచేస్తూ పలు ఉద్యమాలలో పాల్గొన్నారు. ఖానాపురం హవేలీ పంచాయతీ ఎన్నికల్లో జాన్ఫాన్ సతీమణి షాహనాజ్ బేగం పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. గత కార్పోరేషన్ ఎన్నికల్లోను ఆమె పోటీ చేశారు. జాన్యాన్కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు.
జానాఖాన్ మృతివార్త తెలియగానే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు ఖమ్మం చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె అంతిమ యాత్రలో పాల్గొని పాడే మోశారు. అంతకు ముందు సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ జానాఖాన్ పార్దివ దేహంపై అరుణ పతాకాన్ని ఉంచి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు నల్లమోతు నర్సింహారావు, హవేలీ ఏరియా సిపిఐ కార్యదర్శి ఏనుగు గాంధీ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, నాయకులు జాకీర్, ఉపేందర్, ఆముదాల వెంకన్న, అక్రం తదితరులు ఉన్నారు.