SAKSHITHA NEWS

పరిశ్రమలకు సకాలంలో అనుమతులు ఇవ్వాలి : జిల్లా కలెక్టర్
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అన్నీ విధాలా సహకారం అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వెల్లడించారు. జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టరేట్ లో జరిగినది. పరిశ్రమలకు అనుమతుల కొరకు టిఎస్ ఐపాస్ కమిటీతో కలేక్టర్ సమావేశం నిర్వహించారు. డిఐపిసి, టిఎస్ ఐపాస్ కమిటీ సభ్యులతో కలెక్టర్ మాట్లాడుతూ కొత్త పరిశ్రమల స్థాపనకు కొత్తగా చేసుకున్న దరకాస్తులను పరిశీలించి సింగల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేయాలని అదికారులను ఆదేశించారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న దరకాస్తులను పరిశీలించి తక్షణమే మంజూరు చేయాలన్నారు.

సంబంధిత శాఖలు ఎవరి పరిధిలోని అనుమతులు వారు సకాలంలో జారీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ సంబంధించిన టీ ప్రైడ్ పథకం కింద 67 యూనిట్లు మంజూరు చేస్తూ కమిటీ తీర్మానం చేయడం జరిగిందని, టీఎస్ ఐపాస్ 8 యూనిట్లకు గాను 19 అప్రూవల్ కమిటీ తో రివ్యూ చేసినట్లు తెలిపారు. ఐటి హబ్ గురించి కలెక్టర్ టీజీఐఐసీ డిస్టిక్ మేనేజర్ నాగరాజును పూర్తి వివరాలను రెండు రోజుల్లో అందజేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆటోనగర్ సంబంధించిన పూర్తి నివేదికను రేపు సాయంత్రం కల్లా అందజేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ మేనేజర్ టి సీతారాం, ఎల్డీఎం బాపూజీ, సిపిఓ కిషన్, ఫైర్ ఆఫీసర్ జానయ్య, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ ఆదిత్య ,సి టి ఓ బి యాదగిరి, డి టి సి పి ఓ వి మాధవి, డిస్టిక్ గ్రౌండ్ వాటర్ అధికారి ఎం బాలు ,డిటిడిఓ కే శంకర్, పి వెంకటేశ్వర్లు, ఏడిఈ బి ఉదయ భాస్కర్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS