SAKSHITHA NEWS

రుణమాఫీ ఆందోళన , తిరుమలగిరి దాడి ఘటన పై స్పందించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి

శాంతియుతంగా ధర్నా చేస్తున్న తిరుమలగిరి బీఆర్ఎస్ శిబిరం పై కాంగ్రెస్ దాడిని ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు.


సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : రేవంత్ డైరెక్షన్లోనే బీ ఆర్ ఎస్ పై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారనీ హామీల అమలు విఫలం కప్పిపుచ్చుకునేందుకే దాడులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ మోసాలు బయటపడకుండా ఉండేందుకు హింసను ప్రేరేపించి పోలీసుల సమక్షంలోనే శిబిరాన్ని కూల్చివేశారనీ, కాంగ్రెసుతో కలిసి పోలీసులు పనిచేస్తిన్నట్లుగా ఉందని మండిపడ్డారు. రుణమాఫీ పై ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన లేదని, చెయ్యని రుణమాఫీకి కాంగ్రెస్ ప్రచారాలతో డంబాచారాలకు పోతుందని రుణమాఫీ పై రైతులు స్వచ్ఛందంగా ఆందోళనలు చేస్తున్నారనీ జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

స్వయానా మంత్రులే పూర్తిస్థాయిలో మాఫీ కాలేదని చెబుతున్నా ప్రభుత్వం కవరింగ్ చేస్తుందనీ, దాడులు చేసి రెచ్చగట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్ని దాడులు చేసినా ప్రజల కోసం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామని, తిరుమలగిరి సంఘటన పై విచారణ చేయాలనీ రైతాంగానికి న్యాయం జరిగే వరకు ఎన్ని దాడులు చేసినా మా పోరాటం ఆగదనీ స్పష్టం చేశారు. హామీ అమలు మరిస్తే ప్రజలు కాంగ్రెస్ ని వదిలిపెట్టరని, ప్రతిపక్షంగా ప్రజలకిచ్చిన హామీల కోసం ప్రభుత్వం పై ఖచ్చితంగా పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


SAKSHITHA NEWS