SAKSHITHA NEWS

నాకు ఏ ఫామ్ హౌజ్ లేదు.. అది దగ్గరుండి నేనే కూల్చేపిస్తా : కేటీఆర్

జన్వాడ ఫౌంహౌస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తనకు ఏలాంటి ఫామ్ హౌజ్ లేదన్నారు. తన ఫ్రెండ్ కు ఉన్న ఫామ్ హౌజ్ ను లీజ్ కు తీసుకున్నానని చెప్పారు. ఒకవేళ అది ఎఫ్ టీ ఎల్, బఫర్‌ జోన్‌లో ఉంటే దగ్గరుండి తానే కూల్చేపిస్తానన్నారు.

మంచి జరుగుతుంటే అందరం అహ్వానించాల్సిందేనని చెప్పుకొచ్చారు కేటీఆర్. అలాగే కాంగ్రెస్ నాయకులు ఎఫ్ టీ ఎల్, బ్లఫర్ లో కట్టిన పెద్ద పెద్ద బంగ్లాలను కూడా చూపిస్తానన్నారు. వాటిని కూడా కూల్చివేయాలని చెప్పారు కేటీఆర్. రేవంత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ ఎక్కడుందో కూడా చూపిస్తానని తెలిపారు. తప్పు ఎవరు చేసిన చర్యలు తీసుకోవాలని.. ఈ మార్పు మంత్రుల నుంచి మొదలు కావాలని చెప్పుకొచ్చారు.


SAKSHITHA NEWS