SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని JNTU ప్రధాన రహదారి నుండి అడ్డగుట్ట, సమతా నగర్ మీదుగా ప్రగతి నగర్ రోడ్డు కు వెళ్లే కూడలి (MNR కాలేజ్) వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారనికై ట్రాఫిక్ సీఐ వెంకట్ తో కలిసి నిత్యం వాహనాల ట్రాఫిక్ నియంత్రణకై చేపట్టవలసిన చర్యలను పరిశీలించిన కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ JNTU ప్రధాన రహదారి నుండి అడ్డగుట్ట, సమతా నగర్ మీదుగా ప్రగతి నగర్ రోడ్డు కు వెళ్లే వాహనదారులకు నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అని ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై దానిలో భాగంగా తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో కలిసి పరిశీలించడం జరిగినది అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లలో ఆక్రమణల తొలగింపుపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పలు సూచనలు చేశారు. వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ వర్క్స్ జరుగుతున్న సమయాల్లో రోడ్ల తవ్వకాల పూడ్చివేతకు సంబంధించిన అంశాలపై ఫోకస్ పెట్టాలని. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా అన్ని డిపార్ట్మెంట్లు కో ఆర్డినేషన్ తో పనిచేయాలని అధికారులకు తెలియజేసారు. వ్యాపారులు దుకాణాల ముందు వాహనాలు అడ్డదిడ్డంగా పార్కింగ్‌ చేయనీయకూడదని వాహన దారులు వారి వారి వాహనాలను దగ్గర్లోని పార్కింగ్‌ ప్రదేశాల్లో పార్క్‌ చేసి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తద్వారా చాలా వరకు ట్రాఫిక్‌ సమస్య తగ్గేందుకు అవకాశం ఉంటుందని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అధికారులు మరియు నాయకులు కుమార స్వామి, నిరంజన్ రెడ్డి, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 10 at 11.20.08

SAKSHITHA NEWS