SAKSHITHA NEWS

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని శంశిగుడాలో తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయల నిధులతో నిర్మాణ పనులు జరుగుతున్న సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డీసీ ఎచ్.కృష్ణయ్య తో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా సీసీ రోడ్ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.

రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, భాస్కర్ రెడ్డి, వెంకట్ నాయక్, సంతోష్ బిరాదర్, ఉమేష్, ఎఇ శ్రావణి, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 08 at 15.56.24

SAKSHITHA NEWS