SAKSHITHA NEWS

plastic ప్లాస్టిక్ వాడకం మానవాళి మనుగడకే ప్రమాదకరం
లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బొలికొండ శ్రీనివాసరావు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

plastic ప్లాస్టిక్ వాడకం మానవాళి మనుగడకే అత్యంత ప్రమాదకరమని లయన్స్ క్లబ్ ఖమ్మం అధ్యక్షులు, ప్రభుత్వ వైద్యులు బొలికొండ శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల వాడక నిషేధ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక లకారం ట్యాంక్ బండ్ వద్ద ఖమ్మం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాకర్స్ క్లబ్, ఫిమేల్ యోగ క్లబ్ లతో కలిసి ప్లాస్టిక్ వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన విధానంలో ప్లాస్టిక్ వాడకం అత్యంత హానికరమైనదని అన్నారు. ప్లాస్టిక్ వాడకం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్లాస్టిక్ వస్తువులు మట్టిలో కలిసిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుందని ప్లాస్టిక్ వాడకం వలన మనంతట మనమే మన ప్రాణాలకే ముప్పు కలిగించుకుంటున్నామన్నారు ప్రజలు బజారుకు వచ్చినప్పుడు ఇంటి నుండి గుడ్డ సంచులు తెచ్చుకోవాలన్నారు ప్లాస్టిక్ ను వాడటం నిషేధం విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలన్నారు.

అనంతరం వారు కాటన్ చేతి సంచులను ప్రజలకు ఉచితంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గెల్లా శ్రీరామ్, కోశాధికారి ఏ గోవిందరావు, లయన్స్ క్లబ్ సభ్యులు విశ్వేశ్వరరావు, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీదేవి, యోగా పరివార్ అధ్యక్షులు శ్రీలతారెడ్డి, కార్యదర్శి ప్రతిమ, వాకర్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ డిపిసి రావు, కార్యదర్శి ఖాదర్ బాబు, సభ్యులు రమేష్, పుల్లయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

plastic

SAKSHITHA NEWS