Record number of postal ballots in AP
ఏపీలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు
జిల్లాల నుంచి వచ్చిన తాజా లెక్కలు ప్రకారం 5 లక్షల 39వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ వేసి లెక్కించాలనే అంశంపై కూడా నిర్ణయం తీసుకున్న ఈసీ.
రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్లు. ఆ తర్వాత స్థానంలో నంద్యాల జిల్లాలో 25,283 పోస్టల్ బ్యాలెట్లు – మూడో స్థానంలో కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్లు. రాష్ట్రంలో అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు.
ఇప్పటికే పోలైన పోస్టల్ బ్యాలెట్ల వివరాలు రావడంతో ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలన్న దానిపై అధికారులు చర్చ ఒక్కో టేబుల్లో ఎన్ని లెక్కించాలనే అంశంపై రిటర్నింగ్ అధికారులకు సమాచారం పంపిన కేంద్ర ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం లేని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈసీని కోరిన టీడీపీ మౌఖికంగా అంగీకరించిన రాష్ట్ర సీఈవో ముఖేష్ కుమార్ మీనా.లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్న టీడీపీ. డిక్లరేషన్‌పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన సీల్ లేకపోయినా పరిగణలోకి తీసుకోవాల్సిందేనని డిమాండ్
రిటర్నింగ్ అధికారి ఫాసిమెయిల్, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం బాధ్యత ఎన్నికల కమిషన్‌దే అని చెబుతున్న విపక్షాలు.పోస్టల్ బ్యాలెట్లు భారీగా నమోదవడంతో అధికార పార్టీలో కలవరం గతంలో కంటే ఎక్కువగా నమోదు అయ్యాయని ఇది దేశంలో రికార్డు అని చెబుతున్న రాజకీయ పక్షాలు