బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ కేసులో సంచలన విషయాలు….పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్ మిస్.!..పోలీసుల విచారణ లో కీలక ఆధారాలు
బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలువల జరిపిన కాల్పుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
కాల్పులు జరిపిన నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సూచనల మేరకే సల్మాన్ ఇంటిపై దుండగులిద్దరూ కాల్పులు జరిపినట్లు విచారణలో స్పష్టమైంది.
లారెన్స్ గ్యాంగ్‌తో షూటర్ సాగర్ పాల్ కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత విక్కీ గుప్తా ఈ ముఠాలో చేరాడు.
షూటర్ సాగర్ పాల్ రెండేళ్లుగా హర్యానాలోనే ఉంటున్నాడు.
ఈ క్రమంలోనే లారెన్స్ గ్యాంగ్‌కు దగ్గరయ్యాడు.
తర్వాత రెండో నిందితుడు విక్కీ గుప్తా కూడా సాగర్‌తో దోస్తీ కట్టాడు.
సల్మాన్‌పై దాడి చేసిన వీరిద్దరూ ఓ భారతీయ ఫోన్ నంబర్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
ఇప్పుడు ఆ ఫోన్ నంబర్‌పై కూడా విచారణ జరుగుతోంది.
అది ఎవరి నంబర్ అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఏప్రిల్ 14న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
నేరం చేయడానికి ముందు, దాడికి పాల్పడిన వ్యక్తులు సల్మాన్ ఇంటి చుట్టూ మూడుసార్లు రెక్సీ నిర్వహించారు.
దాడి అనంతరం నిందితులిద్దరినీ గుజరాత్‌లోని కచ్‌లో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిందితులు ఇద్దరూ బీహార్‌లోని చంపారన్ వాసులు. ఫిబ్రవరి 29 నుంచి మార్చి 1 మధ్య సల్మాన్ ఖాన్ ఇంటికి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న హోటల్ తాజ్ ల్యాండ్స్ ఎండ్ సమీపంలో దాడికి పాల్పడిన వ్యక్తులు కలుసుకున్నారు…ఇంకా ఈ కేసు పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది