ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిం ద్ కేజ్రీవాల్ కు తిహార్ జైల్లో ముప్పు పొంచి ఉన్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు.
అదే కారాగారంలో ఉన్న కొన్ని గ్యాంగులు పాపులర్ అయ్యేందుకు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం తిహార్ జైల్ నంబర్-2లో కేజ్రీవాల్ ఉన్నారు.
గతంలో ఇక్కడ హత్యలు జరిగాయి. 2021లో శ్రీకాంత్ రామస్వామి అనే నిందితుడిని ఇక్కడ గ్యాంగ్ వార్‌లో చంపేశారు.ఢిల్లీలోని వసంత్ విహార్ వద్ద 2015 లో జరిగిన ఓ హత్య కేసులో అతడిని అరెస్టు చేశారు.
సహ ఖైదీలు అతడిని బ్యాట్లతో తీవ్రంగా కొట్టినట్లు జైలు అధికారులు కోర్టుకు నివేదించారు. అప్పట్లో ఆ కేసుకు సంబంధించి నలు గురిని అరెస్టు చేశారు. ఇటీ వల కూడా జైల్లో జరిపిన తనిఖీల్లో 33 మొబైల్ ఫోన్లు బయట పడ్డాయి.
ఇప్పటికే ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నుంచి కేజ్రీవాల్‌కు బెదిరిం పులు వచ్చాయి. తిహార్ జైల్లోని ఖలిస్థానీలు దాడి చేస్తారని వాటిల్లో హెచ్చరిం చాడు. ఈ మేరకు ఇటీవల వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే…