10 రోజులుగా మున్సిపల్ నీటి సరఫరా నిలిచిపోయిందని ఆరోపిస్తూ 25వ డివిజన్ గాంధీ పార్క్ ప్రాంతం వద్ద డివిజన్ ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్ మీదకు వచ్చి నిరసన తెలియజేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు . గత ప్రభుత్వంలో ఎప్పుడు ఈ విధంగా జరగా లేదని అన్నారు . మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు . తాగునీరు లేక సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు . నీటి ఎద్దడి మహిళల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ అధికారులు ప్రతిరోజు తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు .
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP