నీ దోపిడి బ్రందం కబ్జాల నుంచి విశాఖను రక్షించు…
నీ పాలనలో ఉత్తరాంధ్రలో రూ. 50 వేల కోట్లకు పైగా దోపిడీ…
14 ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టిన నీవా విశాఖను దేశ ఆర్ధిక రాజధానిగా చేసీదీ?…
అమరావతిని గ్రాఫిక్స్ అన్నావు.. అంతకంటే దారుణమైన గ్రాఫిక్స్ తో విశాఖను మోసం చేస్తున్నావు…
జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్
విశాఖపట్నం,
విశాఖను ఎక్కడికో తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని,ముందు అప్పుల కోసం పెట్టిన తాకట్టు నుంచి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ విడిపిస్తే చాలు.విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజన్‌గా మార్చి అభివ్రద్ధితో పరుగులు పెట్టిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి లూలూ మాల్ ను ఎందుకు వెళ్లగొట్టారు? హెచ్ ఎస్ బీ సీ ని ఎందుకు పంపించేశారు? విశాఖ ఐ టీ కి ఎటువంటి సదుపాయాలు కల్పించకుడా ఎందకు పడుకోపెట్టారు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంగీకరించి అనుబంధ సంస్దలను ఎందుకు దెబ్బతీశారు? బంగారు బాతు లాంటి గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాలను ఎందుకు రెండో కంటికి తెలియకుండా కారు చౌకగా అమ్మేశారు?