అధికార పార్టీ కక్ష  భావదేవుడే రక్ష

అధికార పార్టీ కక్ష భావదేవుడే రక్ష

SAKSHITHA NEWS

అధికార పార్టీ కక్ష .. భావదేవుడే రక్ష

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసన గా నరేంద్ర వర్మ ఆధ్వర్యం లో బాపట్ల పట్టణం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరసన వ్యక్తం చేశారు.

మాజీ ముఖ్య మంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నిండైన ఆరోగ్యం తో వర్ధిల్లాలని కోరుకుంటూ బాపట్ల శ్రీ క్షిర భావనారాయణ స్వామి దేవాలయం నందు 101 కొబ్బరి కాయలు కొట్టి స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మొదుగుల శంకర్ రెడ్డి, కలకోట కిషోర్ రెడ్డి, మహిళా నాయకులు బొద్దుకూరి విజయ, శ్రీదేవి, రుక్మిణీ,రమాదేవి, కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS