ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్రవ్యాప్త జనహిత పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది .
ఈ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో, ఆందోల్ నియోజకవర్గం లోని సంగుపేట ఎక్స్ రోడ్ ఆగస్టు 1 న సాయంత్రం నాలుగు గంటలకు జనహిత పాదయాత్ర కార్యక్రమం ఆగస్టు 2వ తేదీన శ్రమదాన కార్యక్రమం ,ఆరోగ్యశాఖ మాత్యులు శ్రీ దామోదర్ రాజనర్సింహ , డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగును.
కావున సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జులు, వివిధ హోదాలలోని నామినేట్ పోస్టుల్లో కలవారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల మరియు పట్టణ అధ్యక్షులు,అలాగే ప్రజా ప్రతినిధులు, మహిళ యువజన విభాగానికి సంబంధించిన వారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.
ఇట్లు
నిర్మల జగ్గారెడ్డి
డిసిసి అధ్యక్షురాలు
టీజీఐఐసీ చైర్మన్
