దుండిగల్ మున్సిపాలిటీ మౌలిక సదుపాయాల కోసం 78 కోట్ల 34 లక్షలు నిధులు మంజూరు

Sakshitha news

|| దుండిగల్ మున్సిపాలిటీ మౌలిక సదుపాయాల కోసం 78 కోట్ల 34 లక్షలు నిధులు మంజూరు ||

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి , నియోజకవర్గ ఇంచార్జి మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన

-నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ కి మౌలిక సదుపాయాల కోసం 78 కోట్ల 34 లక్షలు నిధులు కేటాయించడం పై హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి,ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ..

ఈ సందర్బంగా హన్మంతన్న మాట్లాడుతూ దుండిగల్ మున్సిపాలిటీ లోని గత కొని సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోని విధంగా బి ఆర్ ఎస్ పార్టీ పరిపాలించారు..

కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు అదేవిందంగా నియోజకవర్గంలోని దుందిగల్ మున్సిపాలిటీలో ప్రతి బస్తిలకి మౌలిక సదుపాయాలకు నిధులు మంజురవటం దుండిగల్ మున్సిపాలిటీ ప్రజలకు ఒక గొప్ప వరం అని తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి గ్రంధాలయ చైర్మన్ బొంగునూరు శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ మైసి గారి శ్రీనివాస్, గాగిలాపూర్ మాజీ సర్పంచ్ బల్ రాజ్, శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముత్యం రెడ్డి, జక్కుల మల్లేష్ యాదవ్, సాదు యాదవ్, కుమార్ యాదవ్ పాల్గొన్నారు.