SAKSHITHA NEWS

డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతం పెంపు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, ఎమ్మెల్యేలు….

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల పరిధిలోని వసతి గృహాల్లో కాస్మోటిక్, డైట్ చార్జీలను పెంచుతూ ప్రజా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నిర్ణయం పట్ల యావత్తు విద్యార్థిలోకం హర్షిస్తుందని, ఈ యొక్క నిర్ణయం వల్ల 8 లక్షల మంది హాస్టల్ విద్యార్థులకు మేలు చేకూరుతుందని, డైట్, కాస్మెటిక్‌ ఛార్జీలను ప్రభుత్వం పెంచడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూధన్ రెడ్డి (GMR) , మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి. సురేఖ ప్రేమ్ సాగర్ రావు , ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి , వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి , నారాయణపేట ఎమ్మెల్యే శ్రీమతి. పర్ణిక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS