అసెంబ్లీ ముందుకు 4 కీలక బిల్లులు
హైదరాబాద్:
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం రోజు వాడి వేడిగా సాగాయి అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి అయినప్పటికీ ఈ సమావేశంలోనే శాసనసభ 3 ప్రభుత్వ బిల్లులకు ఆమోదముద్ర వేసింది,
ప్రారంభం కానున్న నేటి సభలో భూభారతి బిల్లు పై చర్చ కొనసాగించ నున్నారు. అదేవిధంగా ప్రభుత్వం తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్ తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లులను కూడా ప్రవేశపట్టనున్నారు.
ప్రశ్నోత్తరాల్లో భాగంగా ప్రభుత్వ అప్పులు, చెల్లింపులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.ఈ సంక్రాంతి నుంచి ప్రభుత్వం ప్రారంభించబోతున్న రైతు భరోసా పై కూడా సభలో చర్చ జరగనుంది.
నేడు అసెంబ్లీ లో కీలక బిల్లులు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఇవాళ గంట ముందే సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీకి చేరుకోనున్నారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలతో సమా వేశం కానున్నారు. భూభారతి రైతు భరోసాపై సభలో చర్చ సందర్భంగా వారికి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు