బోనాల పండుగ సందర్భంగా 292 డివిజన్ సాయిబాబా నగర్

Sakshitha news

బోనాల పండుగ సందర్భంగా 292 డివిజన్ సాయిబాబా నగర్ లోని తెలుగు తల్లి నగర్ నల్లపోచమ్మ ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారాల వినోద్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదానం చేసి, ప్రసాదం స్వీకరించారు.

అనంతరం మాట్లాడుతూ “అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని” ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు తల్లి నగర్ అధ్యక్షులు తారాసింగ్, కరాటే శీను, శ్యామ్, నిరంజన్ ముదిరాజ్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో BRS నాయకులు రాజ్ కుమార్ ముదిరాజ్ , తెలుగు తల్లి నగర్ బస్తీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top