జిల్లా లో టియుడబ్ల్యూజే-ఐజేయు సభ్యత్వ నమోదుకు జర్నలిస్టుల నుంచి విశేష స్పందన

Sakshitha news

జిల్లా లో టియుడబ్ల్యూజే-ఐజేయు సభ్యత్వ నమోదుకు జర్నలిస్టుల నుంచి విశేష స్పందన

సాక్షిత :అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ అందే విధంగా చర్యలు

టి యు డబ్ల్యూ జే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు

జర్నలిస్టుల భద్రత, గుర్తింపు, వృత్తిపరమైన రక్షణ కోసం టియుడబ్ల్యూజే-ఐజేయు సంఘం జర్నలిస్టుల పక్షాన బలంగా నిలబడే ఏకైక సంఘం అని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ – ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (టియుడబ్ల్యూజే-ఐజేయు) ఆధ్వర్యంలో శనివారం మోతే, ఆత్మకూర్ (ఎస్)మండల కేంద్రంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సూర్యాపేట జిల్లాలో సభ్యత్వ నమోదుకు విశేష స్పందన వచ్చిందని వివరించారు.
గ్రామీణ, మండల స్థాయిలో పనిచేసే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. మండల స్థాయి నుంచే సంఘాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాం” అని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా మరిన్ని మండల, జిల్లా కమిటీలను బలోపేతం చేసి, జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నామని చలసాని శ్రీనివాసరావు వెల్లడించారు.


జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేసే ఏకైక సంఘం టి యు డబ్ల్యూ జే ఐజేయు అని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ త్వరలో జిల్లా మంత్రులు అధికారులను కలవనున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో మెజారిటీ అక్రిడిటేషన్ సభ్యులుగా టి యు డబ్ల్యూ జే ఐజేయు యూనియన్ వారే ఉన్నారని, అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ అందే విధంగా కృషి చేస్తామని చెప్పారు. అక్రిడిటేషన్ విషయంలో కొన్ని యూనియన్లు జర్నలిస్టులను గందరగోళ పరిచే విధంగా ప్రవర్తించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే-ఐజేయు సూర్యాపేట జిల్లా ప్రధానకార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు, జిల్లా నాయకులు, రెబ్బ విజయ్ కుమార్, గుడిపూరి రామకృష్ణ, పులుసు నాగరాజు, షేక్ రషీద్ ఖాన్, షేక్ జహీర్ తో పాటు మండలంలోని పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. కొత్తగా సభ్యత్వం పొందిన జర్నలిస్టులకు సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని జిల్లా నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ జర్నలిస్టు ఉపేందర్, ధరావత్ రామకృష్ణ, పల్లె లక్ష్మణ్, కందిబండ గోపి, గుణగంటి నాగరాజు, గుండా సురేష్, ఎల్ ఎన్ రాజు ఎలుగు మధు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top