277వ డివిజన్ మహాదేవపురంలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి కృషితో, సీఎంసీ స్పెషల్ ఫండ్ ద్వారా రూ.40 లక్షలు మరియు రూ.68 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో 277వ డివిజన్ పరిధిలోని మహాదేవపురం కాలనీలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఘనంగా ప్రారంభించారు.
మహాదేవపురం కాలనీలోని A, D, M, W మరియు X బ్లాక్‌లతో పాటు ఫేజ్–2 పరిధిలోని పలు ప్రాంతాల్లో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీల సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన రహదారుల నిర్మాణం, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తూ, ప్రతి కాలనీ అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
మహాదేవపురం కాలనీ అభివృద్ధికి విశేష కృషి చేసి సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి కి కాలనీ వాసులు, వెల్ఫేర్ సొసైటీ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహాదేవపురం 277వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు సిద్ధనోళ్ల సంజీవ్ రెడ్డి, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ అంజలి యాదవ్, మహాదేవపురం కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కే. వెంకటరెడ్డి, ప్రసాద్, రాంచందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ప్రవీణ్, వెంకట్ రెడ్డి, కృష్ణ రెడ్డి, దిలీప్, రాజమహేంద్ర, మల్లారెడ్డి, జాంగా రెడ్డి, శివ రెడ్డి, రాంచందర్ (ఎస్‌ఐ), సంతోష్, రంజిత్, వెంకటేష్, సురేష్, చావా శ్రీనివాస్, వీరయ్య, ప్రభాకర్, అనిల్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, ప్రశాంతి, చర్చి పాస్టర్లు, కాలనీ వాసులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
