అనుమతి లేకుండా హాస్పిటల్ ముందు ధర్నా

Sakshitha news

అనుమతి లేకుండా హాస్పిటల్ ముందు ధర్నా చేసి అత్యవసర వైద్య సేవలను అడ్డుకున్న వారిపై కేసు నమోదు:మహబూబాబాద్ టౌన్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ సర్వయ్య

మహబూబాబాద్ టౌన్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి 27-07-2025 రోజున సీరోలు, బోడతండ ప్రాంతానికి చెందిన బోడ పద్మ అను ఆమె డెలివరీ నిమిత్తం రాగా తనకు ట్రీట్మెంట్ చేసే క్రమంలో ఆమెకు హై బి.పి ఉందని సర్జరీ చేస్తే రిస్క్ అవుతుందని తన భర్తకు మరియు కుటుంబసభ్యులకు ముందుగానే తెలియపరచి ఒప్పందపత్రంపై సంతకాలు తీసుకుని వారి కుటుంబసభ్యుల అంగీకారంతోనే సర్జరీ చేయగా సర్జరీ తరువాత పద్మకి బి.పి అప్, డౌన్ అవుతుండడం వల్ల అబ్జర్వేషన్ లో పెట్టీ చికిత్స అందిస్తున్నక్రమంలో తేదీ 28-07-2025 రోజున తనకు రెండు సార్లు ఫిడ్స్ రావడంవల్ల ట్రీట్మెంట్ చేసినప్పటికీ ఫిడ్స్ తక్కువకాలేదు గుండె కొట్టుకోవడం ఆగింది వెంటనే CPR చేసినప్పటికీ కంట్రోల్ అవ్వక చనిపోయింది, ఇట్టి విషయాన్ని అదునుగా తీసుకుని ఒక సామాజికవర్గానికి చెందిన 1) బోడ రమేష్, 2) మంగీలాల్, 3) భీమా నాయక్, 4) హుస్సేన్ మరియు కొంతమంది కలిసి హాస్పిటల్ గేట్ ముందు కూర్చుని ధర్నా చేస్తుండగా హాస్పిటల్ సిబ్బంది వచ్చి ఎందుకు ధర్నా చేస్తున్నారని అడుగగా అతడిని బూతులు తిడుతూ చేతులతో పిడిగుద్దులు గుద్దినారు, అనుమతి లేకుండా హాస్పిటల్ ముందు ధర్నా చేసి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసి బలవంతంగా కాగితం వ్రాయించి ఒక లక్ష రూపాయలు తీసుకున్నారని, మరియు అత్యవసర వైద్య సేవలను అడ్డుకున్న వారిపై కేసు నమోదు చెయ్యాలని హాస్పిటల్ వైద్యుడు ఇచ్చిన దరఖాస్తుపై కేసు నమోదు చేయనైనదని ఇన్స్పెక్టర్ గారు తెలియపరిచినారు మరియు ఎవరైనా అనుమతి లేకుండా ధర్నాలకు పాల్పడ్డ, వైద్య సేవలకు ఆటంకపరచినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియపరిచినారు.