SAKSHITHA NEWS

మండుటెండలో అలసిపోతున్నా కూడా ఆగని అడుగులు.

సీఎం జగనన్న నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తున్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు

ఉద్యమస్ఫూర్తితో గడప గడపకు మనప్రభుత్వం.

వైసీపీ శ్రేణుల్లో వెల్లివిరిసిన ఉత్సాహం.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,

మైలవరం నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉద్యమస్పూర్తితో జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన లక్ష్యాలను స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సాధిస్తున్నారు. ఇప్పటివరకు నియోజవర్గంలో 60 రోజులు పాటు పర్యటించిన ఆయన 25 వేల గడపలను సందర్శించారు. మండుటెండలోనూ, జోరునవానలోనూ, ఓ పక్కన అలసిపోతున్నప్పటికీ ఆయన అడుగు ఆగలేదు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది.

20 సచివాలయాల్లో పూర్తి

మైలవరం నియోజకవర్గంలో నరుకుళ్లపాడు, చెరువుమాధవరం, పుల్లూరు-2 కాచవరం, కుదప, మైలవరం-2, కట్టుబడిపాలెం, దాములూరు, గడ్డమణుగు, ఇబ్రహీంపట్నం-1, అన్నేరావుపేట, రుద్రవరం, చంద్రాల, కూనపరాజుపర్వ-2, మద్దులపర్వ, కవులూరు-1, కవులూరు-2, కొటికలపూడి (కేతనకొండ-2 సచివాలయం) తుమ్మలపాలెం, మైలవరం-4 సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి అయింది.

వైసీపీ నేతల సంబరాలు.

25 వేల గడపల సందర్శన పూర్తి అయిన సందర్భంగా మైలవరంలో వైకాపా నేతల సంబరాలు అంబరాన్ని తాకాయి. వైసీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ చేత ఈ సందర్భంగా కేక్ కట్ చేయించారు. జగనన్న సంక్షేమాభివృద్ధి పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారని, ఇది ప్రతి గడప సందర్శనలో నిరూపితమైందని శాసనసభ్యులు కృష్ణప్రసాదు స్పష్టం చేశారు.


SAKSHITHA NEWS