22-ఏ నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపునకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన కొలన్ హన్మంత్ రెడ్డి*
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న కొన్ని భూములను జాబితా నుంచి తొలగించాలని మంత్రి కి వినతిపత్రం ద్వారా కోరారు. ఆయా భూములకు సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు.
ఈ అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అంశాన్ని పరిశీలించి *వీలైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజల భూ సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల కొలన్ హన్మంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ కే ఏం గౌరీష్, మహాదేవపురం డివిజన్ అధ్యక్షులు సిద్దనోల సంజీవరెడ్డి,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST