SAKSHITHA NEWS

కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 203 మంది లబ్ధిదారులకు 2,03,23,548/- రెండు కోట్ల మూడు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపేణా లబ్ధిదారులకు అందచేసిన గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్ ,భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 203 మంది లబ్ధిదారులకు 2,03,23,548/- రెండు కోట్ల మూడు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి చెక్కుల రూపేణా అందచేసిన గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఈ రోజు 203 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులు అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది అని , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదింటి ఆడ బిడ్డకు పెద్ద అన్న లాగా నిలుస్తారు అని PAC చైర్మన్ గాంధీ కొనియాడారు. నిరుపేదల అడా బిడ్డల పెళ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా ,మానవతా దృక్పథంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ప్రవేశపెట్టడం జరిగినది అని ,అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, పేదింటి వారి ఇండ్ల లో సంతోషంతో ఆడ పిల్లల పెండ్లి జరగాలని సదుద్దేశంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అని PAC చైర్మన్ గాంధీ కోరారు.

ఈ కార్యక్రమంలో RI శ్రీనివాస్ , మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి, మారబోయిన రాజు యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్ ,శ్రీనివాస్ యాదవ్, అన్వర్ షరీఫ్, ప్రసాద్ , మంత్రి ప్రగడ సత్యనారాయణ, చాంద్ పాషా, ప్రతాప రెడ్డి, నరేందర్ రెడ్డి, తిరుపతి, రజినీకాంత్, పవన్, ఫక్రుద్దీన్ మరియు లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


SAKSHITHA NEWS