SAKSHITHA NEWS

కేవలం రూ.5 లకే 20 లీటర్ల సురక్షిత తాగునీటిని ప్రజలకు అందిస్తు, సురక్షమైన మంచినీటిని తాగడం వల్ల ప్రజల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి

విద్యార్థులతో ముచ్చటించి మెనూ ప్రకారం  వారికి అందుతున్నా వంటకాలను,  సదుపాయాలను అడిగి తెలుసుకున్న – MLA బొండా ఉమ

” సెంట్రల్ నియోజకవర్గంలోని 62 వ డివిజన్ పాయకాపురం రైతు బజార్ నందు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ వారు 2024 సెప్టెంబర్ లో సంబంధించి విజయవాడ వరదల లో ప్రకృతి విపత్తుల బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఆనాటి నుండి త్రాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న సమస్యను గుర్తించి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర చేతులమీదుగా వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ను ప్రారంభించి ₹5 రూపాయలకే 20లీటర్ల మంచి నీటిని ప్రజలకు అందించే కార్యక్రమం మరియు ప్రకాష్ నగర్ చలసాని సూర్యప్రకాష్ రావు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు పాతబడిపోయిన రంగులను మార్చి విద్యార్థులు ఉల్లాసవంతంగా ఉండేందుకు కొత్త హంగులను తీర్చిదిద్దడం జరిగినది…

ఈ సందర్భంగా బొండా ఉమా గారు మాట్లాడుతూ:-యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్ సంస్థ‌ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో నిత్యం పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ ఉంటుందని, డ్వాక్రా సంఘాల ద్వారా ఎంతోమంది మహిళలకు ఉచితంగా శిక్షణ అందించి కుట్టు మిషన్లు, విపత్కర సమయాలలో అందిస్తారని, విజయవాడ వరద సమయంలో ఎన్నో ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలకు ఆనాడు కూడా యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ వారు ప్రకాష్ నగర్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమందికి ఆహారం, నీరు, పాలు, బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు మరియు ఇతర అవసరమైనటువంటి సరుకులను అందజేసి వారు మానవతను చాటుకున్నారని…

ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో  62వ డివిజన్ నందు , ప్రజలకు అందుబాటులో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం అలాగే రైతుబజార్ నందు మొక్కలు నాటడం, పాఠశాలకు నూతన రంగులు అనేది చాలా సంతోషించదగ్గ అంశం అని, విద్యార్థులతో బొండా ఉమా కాసేపు ముచ్చటించి అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని, వారికి కావలసినటువంటి ఏర్పాట్లను తక్షణమే సమకూరుస్తానని తెలియజేసి, ఈ సంస్థను బొండా ఉమా అభినందించి భవిష్యత్తులో కూడా ఈ సేవా సంస్థ వారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు తోడుగా నిలవాలని తెలియజేశారు…

ఈ కార్యక్రమంలో:-EX. కార్పొరేటర్ పైడి తులసి,పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సింగం వెంకన్న,   యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ CEO రేఖ శ్రీనివాసన్, డివిజన్ అధ్యక్షులు తొట్టెంపూడి ఉదయ్ శంకర్, పైడి శ్రీను, బుల్లెద్దుల రవిచంద్ర, సీనియర్ నాయకురాలు,రమణమ్మ, బోను వెంకాయమ్మ, సాయి, జటాధర్, మరియా, మెరుగు భరత్, కండూరి రాములు, ప్రశాంత్, రమేష్,మోహన్, మేరీ, తదితరులు పాల్గొన్నారు