SAKSHITHA NEWS

పేద‌ల ఇళ్ల నిర్మాణాల‌కు రూ. 2.50ల‌క్ష‌లు

కూట‌మి ప్ర‌భుత్వంలోనే పేద‌ల సొంతింటి క‌ల స‌కారం

నాడు పేద‌ల ఇళ్ల‌పై ప‌గ‌బ‌ట్టిన జ‌గ‌న్
జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీన‌ర్ పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌: పేద‌ల సొంతింటి క‌ల స‌కారం చేసే దిశ‌గా కూట‌మి ప్ర‌భుత్వం అడుగులు వేస్తున్న‌ద‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంద్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి చెప్పారు. శుక్ర‌వారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఇంటి నిర్మాణానికి కేవలం రూ.1.80 లక్షలు మాత్రమే అందించేవారని గుర్తు చేశారు. పెరిగిన నిర్మాణ వ్య‌యాల‌కు అనుగుణంగా కూట‌మి ప్ర‌భుత్వం. ఈ పథకం కింద ఎంపికైన వారికి రూ. రూ.2.5ంలక్షలు అందించ‌నున్నార‌ని వెల్ల‌డించారు. దీంతో పాటు గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకం ద్వారా మంజూరై గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్న ల‌బ్దిదారుల‌కు బిల్లులు మంజూరు చేయ‌నున్న‌ద‌ని వెల్ల‌డించారు.దీంతో పాటు టిడ్కో గృహాల్లో మిగిలిన గృహాలు కూడా పూర్తి చేసి మౌలిక వ‌స‌తులు క‌ల్పించ‌నున్నార‌ని తెలిపారు.


పేదల ఇళ్లపై పగబట్టిన జగన్‌….
అర్హులు అందరికీ ఇళ్లు ఇస్తాం. మాది పేదల ప్రభుత్వం అంటూ గ‌త ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వివిధ వేదికలపై ఊక‌దంపుడు ఉపన్యాసాలు ఇచ్చార‌ని బాలాజి గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన పథకం అయితే చాలు తీసి పక్కనపెట్టేయ్‌. అది నిరుపేదలకు మేలు చేసేదైనా పట్టించుకోవద్దు “. ఇదీ గత ఐదేళ్లుగా జగన్‌ ప్రభుత్వ తీరని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వంలో 60 నుంచి 90 శాతం పూర్తి చేసిన ఇళ్లనూ జగన్‌ సకాలంలో లబ్ధిదారులకు ఇవ్వలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేవారు. పేదలకు పెద్దఎత్తున ఇళ్లు కట్టిస్తున్నామంటూ ఐదేళ్లగా ఆశల పల్లకిలో ఊరేగించిన జగన్‌, తాను అధికార పీఠం ఎక్కేసరికే టీడీపీ హయాంలో కట్టి ఉన్న టిడ్కో ఇళ్లపై శీతకన్ను వేశారని వెల్ల‌డించారు. మ‌రోవైపు జ‌గ‌న‌న్న కాల‌నీల పేరుతో సెంటు భూమిని ఊళ్ల‌కు దూరంగా, నివాస‌యోగ్యం కాని ప్ర‌దేశాల్లో కేటాయించి ఏదో చేశామ‌ని ప్ర‌చారం చేసుకున్నార‌ని వెల్ల‌డించారు. ఇందులోనూ ప్ర‌జాప్ర‌తినిధులు కోట్లాది రూపాయ‌ల అవినీతి పాల్ప‌డ్డార‌ని పేర్కొన్నారు. పేద‌ల క‌ష్టాలు ప‌ట్ట‌కుండా వ్య‌వ‌హించార‌ని, అందుకే జ‌గ‌న్ హాయంలో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయ‌ని వివ‌రించారు.


SAKSHITHA NEWS