కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 173 మంది లబ్ధిదారులకు 1,73,20,068/-ఒక కోటి డెబ్భై మూడు లక్షల ఇరవై వేల అరవై ఎనిమిది రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
కూకట్పల్లి మండలం పరిధిలోని వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ , కూకట్పల్లి (పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 173 మంది లబ్ధిదారులకు 1,73,20,068/-ఒక కోటి డెబ్భై మూడు లక్షల ఇరవై వేల అరవై ఎనిమిది రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి చెక్కుల రూపేణా అందచేసిన PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ 73 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులు అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది అని , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదింటి ఆడ బిడ్డకు పెద్ద అన్న లాగా నిలుస్తారు అని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు. నిరుపేదల అడా బిడ్డల పెళ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా ,మానవతా దృక్పథంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ప్రవేశపెట్టడం జరిగినది అని ,అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, పేదింటి వారి ఇండ్ల లో సంతోషంతో ఆడ పిల్లల పెండ్లి జరగాలని సదుద్దేశంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఎమ్మెల్యే గాంధీ కోరారు.
ఈ కార్యక్రమంలో సంజీవ రెడ్డి, ప్రసాద్, లక్ష్మీనారాయణ,కాశినాథ్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, ఎల్లం నాయుడు, అష్రాఫ్, పోశెట్టి గౌడ్ ,శ్రీహరి మరియు లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు