
16 తులాల బంగారం 84 తులాల వెండి దొంగలించిన పాత నేరస్థుడి ని పట్టుకున్న పోలీసులు
కల్వకుర్తి డిఎస్పి వెంకటేశ్వర్లు
నాగర్ కర్నూల్ జిల్లా సాక్షిత ప్రతినిధి
నాగర్ కర్నూల్ జిల్లా
కల్వకుర్తి పట్టణంలోనీ వాసవి నగర్. సుభాష్ నగర్ ఏరియాలో దొంగతనాలుజరిగాయి. అలాగే ఊరుకొండ మండలంలోని ముచ్చల పల్లి గ్రామంలో దొంగతనలు జరిగాయి. ఇందుకుగాను నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కల్వకుర్తి పట్టణంలో స్పెషల్ డ్రైవ్ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. మంగళవారం రోజు కల్వకుర్తి పట్టణంలోని నాగర్ కర్నూల్ ఎక్స్ రోడ్ లో కల్వకుర్తి సీఐ నాగార్జున ఎస్సైలు మాధవరెడ్డి.కృష్ణదేవ. క్రైమ్ కానిస్టేబుల్ నజీర్. చిరంజీవి. వెహికల్ చెకింగ్ చేస్తుండగా FZ బైక్ పై ఒక వ్యక్తి పోలీసు వారినిచూసిపారిపోవడానికిప్రయత్నించగా చాకచక్యంతో పోలీసులు పట్టుకోవడం జరిగింది. అతనిని విచారించగా తన పేరు భాషమోని సైదులు అని చేసిన నేరాలను ఒప్పుకోవడం జరిగింది.ఇతని వద్ద నుండి 16 తులాల బంగారం 84 తులాల వెండి ఇతడు దొంగతనాలకు ఉపయోగించే బైక్ ఎఫ్ జెడ్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లలో సుమారు 50 నుంచి 60 కేసులు ఉన్నాయి. ఈ విషయంపై కల్వకుర్తి డి.ఎస్.పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భాష మౌని సైదులు పై సుమారు 50 నుండి 60 వరకు కేసులు ఉన్నాయని ఇతను fz బైక్ పై తిరుగుతూ కల్వకుర్తిలో వాసవి నగర్. సుభాష్ నగర్ కాలనీలలో పలు దొంగతనాలు చేశాడని ఊరుకొండ మండలం ముచ్చలపల్లి గ్రామంలో దొంగతనం చేశాడని అతని వద్దనుండి 16 తులాల బంగారం 84 తులాల వెండిని అలాగే ఒక ఎఫ్ జెడ్ బైక్ ను స్వాధీన పరుచుకున్నామని నిందితుడిని బుధవారం సాయంత్రం రిమాండ్ కు పంపించడం జరిగిందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో చాకచత్యం ఊహించిన కల్వకుర్తి సీఐ నాగార్జున.ఎస్ఐ మాధవరెడ్డి. ఊరుకొండ ఎస్సై కృష్ణదేవ. క్రైమ్ కానిస్టేబుల్ నజీర్. చిరంజీవి లను జిల్లా ఎస్పీ నుండి రివార్డులు ఇప్పియడం జరుగుతుందని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app