SAKSHITHA NEWS

మామిడిపండ్ల మార్కెట్ ను మంత్రి కొండ సురేఖ తో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ….

వరంగల్ జిల్లా….
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని ముసలమ్మకుంట గ్రామ శివారు లో నూతన మామిడిపండ్ల మార్కెట్ ను తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి శ్రీమతి కొండా సురేఖ తో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ….

తొలుత అధికారులు మంత్రి సురేఖ ని ఎమ్మెల్యే నాగరాజు ను ఘన స్వాగతం పలికారు…

మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు కు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు…

అనంతరం పూజ కార్యక్రమం నిర్వహించి రిబ్బన్ కట్ చేసి మార్కెట్ ను ప్రారంభించిన మంత్రి సురేఖ , ఎమ్మెల్యే నాగరాజు ..

తదనంతరం రైతుల దగ్గరి నుంచి తీసుకొని వచ్చిన మామిడి పండ్లను వ్యాపారస్తుల కొనుగోలును ప్రారంభించారు….

మామిడి పండ్లను ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న పెద్ద ఆసామి నిమ్మానీ శేఖర్ రావు ని శాలువాతో సత్కరించిన మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు ….

అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:-…

పండ్ల మార్కెట్ వచ్చేవారి కోసం నా సీడీఎఫ్ నిధుల నుంచి మర్గుదొఢ్లకు 10 లక్షల మంజూరు చేస్తానన్నారు…

పండ్ల మార్కెట్ అభివృద్ధి కోసం డిపిఆర్ తయారు చేయించి మంత్రుల సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు…

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డివో చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ బొమ్మేని రవీందర్ రెడ్డి, పండ్ల మార్కెట్ అధ్యక్షుడు వెల్ది సాంబయ్య స్థానిక కార్పొరేటర్ తూర్పాటి సులోచన – సారయ్య, డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు….

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app