14 నెలలు గడిచిన నేతన్నకు లేదు సాయం

Sakshitha news

14 నెలలు గడిచిన నేతన్నకు లేదు సాయం

బాబు మాటలు నీటి పైన రాతలు ఒకటే

కూటమి ప్రభుత్వంలో చేనేతలకు ఉరితాడే శరణమా

జగనన్న ప్రభుత్వంలో చేనేతలకు ఆర్థిక అభివృద్ధి

వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్

  కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు దాటినప్పటికీ., కుటమి ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా చేనేతకు ఇచ్చిన ఏ ఒక్క హామీ  అమలుచేయక చేనేతలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది..అని జానం రవీంద్ర యాదవ్. రేపన సంజీవయ్య. బీసీ నాయకులతో కలిసి వైఎస్సార్సీపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.గత సంవత్సరం ఆగష్టు7న చేనేత దినోత్సవం సందర్భంగా చంద్రబాబు  వేదికపై నుండి ప్రకటించిన ఏ హామీ అయినా అమలు జరిగిందా..

14 నెలలు గడిచింది, మళ్ళీ రెండవసారి చేనేత దినోత్సవం వచ్చేస్తుంది..నేతన్ననేస్తం.
200 యూనిట్ల విద్యుత్.
GST రద్దు.
చేనేత ఫించను అమలు.
ఆరోగ్య భీమా ఎప్పుడు అమలు జరుగుతాయి. బాబు

గత YSR ప్రభుత్వం హామీఇచ్చి, అమలుచేసిన నేతన్ననేస్తం చేనేతలకు కరోనా కష్ట కాలంలో ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడిన ఈవిషయం మనందరికీ తెలిసిందే..దీనిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తామని చెప్పింది..గత జగనన్న YSR ప్రభుత్వం నేతన్ననేస్తం 5 విడతల విడుదల విడుదల చేసి చేనేతలకు ఎంతో చేయూతనందించారు జగన్మోహన్ రెడ్డి వారు చేనేతులకు ఆర్థిక సాయం ఇచ్చిన తేదీలు.
1వ విడత : 21 dec 2019
2వ విడత : 20 June 2020
3వ విడత. :10 Aug 2021
4వ విడత. : 24 Aug. 2022
5వ విడత. : 22 July. 2023
ఐదు విడుదలకు గాను నేతన్నలకు 1,20,000 ఆర్థిక సాయం అందించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి .
ఇప్పటికే ఒక సంవత్సరం నాలుగు నెలలు రెండు విడతల నేతన్ననేస్తం కోల్పోయాం రెండు విడుతులకు గాను 48 వేల రూపాయలు కూటమి ప్రభుత్వం నేతనులకు బాకీపడినది..ఈ సంవత్సరం అయినా అమలు చేస్తారనే స్పష్టత లేదు..కనీసం దీనికి ప్రత్యామ్నాయంగా పరిశ్రమకు ఏదైనా చేసారా అంటే అదీలేదు కూటమి ప్రభుత్వంలో చేనేతలకు రెండు సంవత్సరాల నేతన్న నేస్తం కోలిపోయాం కూటమి ప్రభుత్వం మాటలు చెప్పడమే గాని చేతల సాయం చేసే పరిస్థితి కనపడటం లేదు..ఇక ఉచిత విద్యుత్ విషయానికి వస్తే గత YSR ప్రభుత్వం100 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అమలుచేసింది,దానిని ప్రస్తుతం ఓటమి ప్రభుత్వం 200 యూనిట్లకు పెంచటం సంతోషమే కానీ చేనేతలకు పెద్దగా ఆర్థికంగా ఉపయోగంకాదు..ప్రస్తుతం 100 కన్నా కొందరు 10,20 యూనిట్లు ఎక్కువ మాత్రమే వినియోగిస్తారు..
ఉచిత విద్యుత్ వలన ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఉచిత విద్యుత్తే కాకుండా చేనేతకు ఏడాదికి 30 వేల రూపాయలు అందించాలి..
GST రద్దు అంచనాలలోనే ఉంది..

ఆరోగ్య భీమాపై కసరత్తు జరుగుతూ……ఉంది.

ఫించన్లు విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక 14 నెలల కాలంలో ఒక్క చేనేత ఫించను కూడా మంజూరు లేదు..చేనేత కార్మికులు మరణిస్తే భార్యకు వితంతుఫించను ఒక్కటి కూడా మంజూరులేదు..
గత ప్రభుత్వం చేనేతలకు అమలచేసిన పథకాలు కూడా అమలు చేయకుండా, చేనేతలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వం వలన కార్మికులకు తిరిగి ఆకలిభాదలు అప్పులతో చావులు పరిచయం అవుతున్నాయి కానీ కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా చలనం లేదు…కనీసం ఈ సంవత్సరం చేనేత దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం నేతన్న నేస్తం రెండు విడతల 48 వేల రూపాయలు అందించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను.. అమలులోకి వస్తుందన్న ఉచిత విద్యుత్ మాత్రమే అమలు చేస్తారని మిగిలిన హామీల పరిశీలన లోనే కొనసా…గిస్తారని తెలుస్తుంది.. అలాకాకుండా..నేతన్ననేస్తం,మిగిలిన హామీలు కూడా తప్పనిసరిగా వెంటనే అమలు చేయాలి..
నిజంగా చేనేతకు ఇచ్చిన హామీలు అమలు జరిగినప్పుడు మనందరం తప్పకుండా పాలాభిషేకాలు చేయాలి, చేద్దాం కూడా…అలా కాకుండా పరిశ్రమకు ఒక్క రూపాయి ఉపయోగం కలగకుండానే మనవాళ్ళ అత్యుత్సాహంతో పాలాభిషేకాల వలన ఎవరికి ఉపయోగం..
వ్యక్తిగత ప్రయోజనాల కోసం,పదవుల కోసం చేనేత నాయకుల ముసుగులో పరిశ్రమకు అన్యాయం జరిగినా,నోరుమెదపనివారేగా చేనేతకు నిజమైన ద్రోహులు..
హామీల అమలు వలనకలిగే నిజమైన ఆనందం, పదవులు ఆశించి పాలాభిషేకాలు చేసే నాయకుల మోములలో కాదు,చేనేతల జీవితాలలో వెలుగులు ఉండాలి.!
కాబట్టి చేనేత పరిశ్రమకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణం అమలు జరిపి,చేనేతల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను అనే వైఎస్ఆర్సిపి బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ ఎద్దేవ చేశారు…