పేకాట స్థావరాలపై పోలీసుల నిఘ పట్టుబడ్డ పేకాటగాళ్లు
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం కాలనీ శివారులోని పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై యాయాతి రాజు తెలిపారు. పేకాటలో 8 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని, రూ. 3,790 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. గత నెల 31 న పట్టుబడిన 6 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసి, తహసీల్దార్ ఎదుట హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.
