గ్యారంటీల గారడితో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
6 అబద్ధాలు.. 66 మోసాలు
అన్నదాత అరిగోశలు.. మోసపోయిన మహిళలు… ఉద్యోగుల గోసలు..
కాంగ్రెస్ సంవత్సర పాలనలో జగిత్యాల్ అభివృద్ధి ఏది అని ప్రశ్నించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి
కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ అప్రజాస్వామిక మోసపూరిత పాలనలో గోస పడుతున్న బాధితులకు భరోసానిచ్చేందుకు భారతీయ జనతా పార్టీ భరోసా కల్పించేందుకు బిజెపి రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు జగిత్యాల్ నియోజకవర్గంలో ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆరు గ్యారంటీల అమలుపై చార్జిషీట్ విడుదల చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఏడాది పాలనను పూర్తి చేసుకుంది కానీ నమ్మి ఓటు వేసిన ప్రజల జీవితాల్లో మార్పు మాత్రం రాలేదు,
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు గ్యారెంటీల గారడితో తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాల పేరిట మరిన్ని అబద్ధాల ప్రచారానికి తెరలేపుతోంది. డిసెంబర్ 7న కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల తరఫున విడుదల చేస్తున్న చార్షీట్…
జగిత్యాల్ నియోజకవర్గం లో ప్రధాన సమస్య అయిన యావర్ రోడ్ మరియు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలు ఇప్పటివరకు ముందుకు సాగని పరిస్థితి
జగిత్యాల్ నియోజకవర్గంలో ఒకరు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరొకరు జగిత్యాల అభివృద్ధి కోసమని కాంగ్రెస్ పార్టీలో దొంగ చాటున చేరారు కానీ అభివృద్ధి మాత్రం కాలేదు.
రైతులందరికీ రూ.2 లక్షల పంట రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు కానీ అది కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు,
ప్రతి ఏటా రైతు భరోసా కింద రైతులు కౌలురైతులకు ఎకరానికి ఇస్తామన్న రూ.15,000 ఇప్పటివరకు ఇవ్వకుండా మోసం చేసింది.
యువ వికాసం కింద విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు అనే అమలుకు నోచుకోలేదు.మరియు అదేవిధంగా నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదు,
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ. 2500 చొప్పున ఆర్థిక సాయం అందని ద్రాక్ష గానే మిగిలింది. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అమలు చేశామని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బస్సులను తప్పించడంతో రద్దీ పెరిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తున్న ఇంతవరకు ఏ ఒక్కరికి కొత్త పెన్షన్ మంజూరు కాలేదు,
ప్రతి ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి 12000 ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు ఇప్పటివరకు,
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడిచినా కూడా బీసీ డిక్లరేషన్ కానీ సబ్ ప్లాన్ కానీ అమలు చేయలేదు,
అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన ఏ ఒక్క అర్హుడికి కూడా రేషన్ కార్డు అందరి పరిస్థితి
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రమాదంలో పడింది మహిళలపై వేధింపుల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి,
కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత పాలనతో తెలంగాణ రాష్ట్రం మరింత అప్పుల ఊగులోకి కూరుకుపోతుంది,
ఈ కార్యక్రమంలో జగిత్యాల్ పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, మండల అధ్యక్షులు నలువాల తిరుపతి,అడెపు నర్సయ్య, రామ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శిలు ఆముదరాజు, సిరికొండ రాజన్న, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ, మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్, పూజారి శ్రీనివాస్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, టౌన్ ఇంచార్జ్ మ్యాదరి అశోక్, పవన్ సింగ్, గాదస్ రాజేందర్,సింగం పద్మ, దీటి వెంకటేష్, చెరుకు గంగారెడ్డి, మహేష్ యాదవ్, కందుకూరి లక్ష్మణ్, చిట్యాల రాము మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.