
131 డివిజన్ కుత్బుల్లాపూర్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు ||
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి భాగంగా దేశంలోనే మొట్టమొదటి సరిగా మన రాష్ట్రంలో ఎస్సీ కేటగరేషన్ చేస్తూ అసెంబ్లీ లో ఏకగ్రీవంగా బిల్లు ఆమోదించిన విషయం తెలిసిందే మరియు బి.ఆర్ అంబేద్కర్ మ్యూజియన్ని ప్రారంభిస్తున్న సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని 131 డివిజన్ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాకీర్ ఆధ్వర్యంలో అంబెడ్కర్ నగర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘననివాళులు అర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, క్యాబినెట్ మంత్రులకు కృతజ్ఞత తెలుపుతూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్బంగా డివిజన్ అధ్యక్షులు మాట్లాడుతు ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మన దేశానికి ప్రసాదించిన నాయకుడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన అడుగుజాడల్లో పయనించి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని అప్పుడే ఆయనకు మనం నిజమైన నివాళులర్పించిన వారమవుతామన్నారు. ప్రతి దినం మన దేశ రాజకీయాలను ప్రశ్నించాల్సిన ప్రజానీకానికి బీజం నాటిన నిఖార్సైన సాంఘిక విప్లవవాది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జగదీష్ గౌడ్, రమణ,పెంటయ్య ముదిరాజ్, కృష్ణ యాదవ్, ఆగమయ్య, డివిజన్ మహిళ అధ్యక్షురాలు సుజాత, షేక్ ఖయ్యుమ్, అజిజ్, హేమావతి, సంగీత్ అంకిత, సాగర్ రాములు పాల్గొన్నారు.
