పొద్దుటూరులో ఘనంగా చాకలి ఐలమ్మ 129 వ జన్మదిన వేడుకలు
*తెలంగాణ మహిళా శక్తిని దేశానికి చాటిచెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ – బొల్లారం వెంకట్ రెడ్డి (ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు)
*తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ – ప్రొద్దుటూరు మాజీ వార్డు సభ్యులు చాకలి రాములు
…………………………………………….
సాక్షిత శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా,శంకర్ పల్లి మండలం, ప్రొద్దుటూరు గ్రామం లో చాకలి ఐలమ్మ 129 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రొద్దుటూరు గ్రామ మాజీ వార్డ్ మెంబర్ చాకలి రాములు అధ్యక్షతన, రజకసంఘం ఆధ్వర్యం లో జరిగిన ఈ జన్మ దిన వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రొద్దుటూరు గ్రామ మాజీ ఎంపిటిసి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపిటిసిలు ఫోరం అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీర వనిత చాకలి ఐలమ్మ తెలంగాణ మహిళా శక్తిని,పౌరుషాన్ని ప్రపంచానికే చాటిచెప్పిందని, ఆమె ఉక్కు సంకల్పం బహుజన ప్రజల ఆత్మగౌరవ ప్రతీక గా నిలుస్తుందని కొనియాడారు.ప్రతి మహిళ చాకలి ఐలమ్మ స్పూర్తితో ఉక్కు సంకల్పం తో ముందుకు సాగాలని అన్నారు. మన గ్రామం లోని రజక సంఘం ఇంత గొప్పగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మన అందరికీ స్ఫూర్తి దాయకమని అన్నారు. సామాజిక స్పృహ తో ప్రతి సంవత్సరం చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతి వేడుకల బాధ్యతలను తన భుజాన వేసుకొని ముందుండి నడిపిస్తూ విజయవంతం చేస్తున్న, ప్రొద్దుటూరు గ్రామ మాజీ వార్డు సభ్యులు చాకలి రాములు ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ : మాజీ వార్డు సభ్యులు చాకలి రాములు
ప్రొద్దుటూరు గ్రామ మాజీ వార్డు సభ్యులు చాకలి రాములు మాట్లాడుతూ.., భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం, విప్లవాగ్ని సృష్టించిన చాకలి ఐలమ్మ, ఈ భూమి నాది, పండించిన ఈ పంట నాది, తీసుకెళ్లడానికి దొరెవ్వడు అంటూ.., పిడి బాకులా,అగ్ని కనికె లా,విరుచుకు పడుతూ.., నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పంట ను ఎవరు దోచుకెల్లలేరని, నా ప్రాణం పోయకే ఈ పంట తీసుకెళ్లాలని రోకలి బండ చేత బూని, ఆనాటి దొరలను తరిమికొట్టిన ధీశాలి చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు. ఐలమ్మ తెగింపు, పౌరుషం, ధైర్య సాహసాలు మనందరికీ స్ఫూర్తి దాయకమని, ఆ మహనీయులురాలి అడుగుజాడల్లో మనందరం నడవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. చాకలి ఐలమ్మ చరిత్ర భావి తరాలకు తెలియజేయడం మనందరి బాధ్యత అని, అందుకొరకు ఆమె చూపిన తెగువ, త్యాగం, ధైర్యసాహసాలు భావితరాలకు తెలిసేలా మన గ్రామం లో ఆ మహనీయుయురాలి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం మనందరికీ గర్వకారణమని, ఆమె ఇచ్చిన స్పూర్తి తో మనందరం ముందుకు కొనసాగాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రొద్దుటూరు మాజీ ఎంపిటిసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపిటిసిల ఫోరం మాజీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ బొల్లారం మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ కె శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ బండ నర్సింహ, మాజీ కో ఆప్షన్ సభ్యులు కవేలి జంగారెడ్డి, మాజీ వార్డు సభ్యులు చాకలి రాములు, మాజీ వార్డు మెంబర్ నాని రత్నం, మాజీ వార్డు సభ్యులు చాకలి వెంకటేష్, పెద్దలు పులకండ్ల రఘుపతిరెడ్డి, నాని బుచ్చయ్య, కవేలి తిరుపతి రెడ్డి, నాని మల్లయ్య, బొల్లారం జంగారెడ్డి, లస్కర్ రాజశేఖర్ రెడ్డి,ష్ణు వర్ధన్ రెడ్డి, మందు మూల యాదయ్య, క్రాంతి యూత్ వైస్ ప్రసిడెంట్ నాని మల్లేశం, రజక సంఘం అధ్యక్షులు చాకలి అనంతయ్య, ఉపాధ్యక్షులు చాకలి మహేందర్, చాకలి లక్ష్మయ్య, చాకలి శ్రీకాంత్ , చాకలి యాదయ్య, ఎం రాజు, ఎన్ ప్రవీణ్, ఎస్ నరేందర్, సిహెచ్ మహేష్, సిహెచ్ అంజయ్య, ఎన్ కుమార్, సి హెచ్ మహేందర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.