127 డివిజన్ గుబురుగుట్ట సంజయ్ గాంధీ నగర్ నుతన ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 డివిజన్ రంగ రెడ్డి నగర్ పరిధిలోని గుబురుగుట్ట సంజయ్ గాంధీ నగర్ నుతన కమిటీ అధ్యక్షులుగా బండారు నారాయణ మరియు జనరల్ సెక్రటరీగా వెంకటేశ్ ముదిరాజ్ గార్లు ఎన్నికైన సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మరియాదా పూర్వకంగా కలిసి కాలనీ అభివృద్ధికై తమవంతు సహకారానికి అందించాలని కోరారు అనంతరం హన్మంతన్న నుతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు సత్కరించి శుభాకాంక్షలు తెలిపి కాలనీ అభివృద్ధికై తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాపా సుబ్బరెడ్డి , మజీ వార్డ్ మెంబెర్ -భాస్కర్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు మల్లయ్య , మల్లేష్ యాదవ్ , సుధీర్ కుమార్, చిన్న, రాజేష్, కిరణ్, సంగారెడ్డి, టీంకు , సుమన్ మరియు తదితరులు పాల్గొన్నారు.