124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1 లో ఉన్న పల్లె దవాఖాన ను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనిఖీ చేసి, వారు అందిస్తున్న వైద్య సేవల ప్రక్రియను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పల్లె, బస్తి దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూపేనే ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని రోగాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఆల్విన్ కాలనీ ఫేస్ 1 లోని పల్లె దవాఖానలో బిపి మరియు షుగర్ కు సంబందించిన మాత్రల(టాబ్లెట్స్) కొరత ఉందని డాక్టర్ తో మాట్లాడిన తరువాత తెలిసిందని అన్నారు. వెంటనే ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మాత్రలు తొందరగా వచ్చే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, పోశెట్టిగౌడ్, బి.వెంకటేష్ గౌడ్, కుమార చారి, రాంరెడ్డి, రఘు, నరసింహ రెడ్డి, హేమలత, రాజేందర్, డాక్టర్ సాయి కృష్ణ, ఏ.ఎన్.ఎం శశికళ తదితరులు పాల్గొన్నారు.
124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1 లో ఉన్న పల్లె దవాఖాన
Related Posts
పల్లెల నుండి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు
SAKSHITHA NEWS పల్లెల నుండి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ టోర్నమెంట్ ను నిర్వహిస్తోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు.……………………………………సాక్షిత : జనగామ జిల్లా కేంద్రంలోని మినీ…
కేసీఆర్, కేటీఆర్లవి తీవ్రమైన నేరాలు: CM రేవంత్
SAKSHITHA NEWS కేసీఆర్, కేటీఆర్లవి తీవ్రమైన నేరాలు: CM రేవంత్ కేసీఆర్, కేటీఆర్లవి తీవ్రమైన నేరాలు: CM రేవంత్TG: రాష్ట్రంలో పదేళ్ల BRS పాలనలో ప్రజల సొమ్ము దోపిడీ, ఆర్థిక విధ్వంసం జరిగాయని.. వారి భూబాగోతాలు, అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు అసెంబ్లీ…