కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 11 మంది లబ్ధిదారులకు 11,01,276/- పదకొండు లక్షల ఒక వెయ్యి రెండు వందల డెబ్భై ఆరు రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపేణా లబ్ధిదారులకు అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్ ,భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 11 మంది లబ్ధిదారులకు 11,01,276/- పదకొండు లక్షల ఒక వెయ్యి రెండు వందల డెబ్భై ఆరు రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి చెక్కుల రూపేణా అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఈ రోజు 11 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులు అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది అని , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదింటి ఆడ బిడ్డకు పెద్ద అన్న లాగా నిలుస్తారు అని PAC చైర్మన్ గాంధీ కొనియాడారు. నిరుపేదల అడా బిడ్డల పెళ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా ,మానవతా దృక్పథంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ప్రవేశపెట్టడం జరిగినది అని ,అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, పేదింటి వారి ఇండ్ల లో సంతోషంతో ఆడ పిల్లల పెండ్లి జరగాలని సదుద్దేశంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అని PAC చైర్మన్ గాంధీ కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,ప్రసాద్, నరేష్ నాయక్, సంతోష్ ముదిరాజ్ ,శివ ముదిరాజ్, వెంకటేష్, భీమ్ రాజ్ , అవినాష్, చందు, మరియు తదితరులు పాల్గొన్నారు. మరియు లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.