హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ కాలనీ లో గల పార్క్ సమస్య

Sakshitha news

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ కాలనీ లో గల పార్క్ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పై తాజా మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీ వాసులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ మిత్ర హిల్స్‌ కాలనీ సొసైటీ పార్కు కోసం కేటాయించేలా తన వంతు శాయశక్తుల కృషి చేస్తానని PAC చైర్మన్ గాంధీ తెలిపారు..
ఈ అంశాన్ని అనవసరంగా రాజకీయ వివాదంగా మార్చవద్దని కాలనీవాసులకు సూచించారు..

రాజకీయ లబ్ధి కోసం కొందరు మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ PAC చైర్మన్ గాంధీ వ్యాఖ్యానించారు..
అలాంటి ప్రలోభాలకు లోనుకావద్దని సొసైటీ సభ్యులను కోరారు..

గతంలో కొందరు కౌన్సిలర్లు తామే ఈ భూమిని పార్కు కోసం కేటాయించామని చెప్పడంపై కూడా ఎమ్మెల్యే స్పందించారు..
వారు కౌన్సిలర్లుగా ఉన్న సమయంలోనే అసలు మిత్ర హిల్స్ కాలనీ కూడా ప్లాటింగ్ కూడా జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు..

3500 గజాల స్థలాన్ని మిత్ర హిల్స్ సొసైటీకి పార్కు రూపంలో మరియు కమ్యూనిటీ హాల్ కోసం వినియోగించే వరకు పోరాటం కొనసాగిస్తానని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ గారు కాలనీ వాసులకు హామీ ఇచ్చారు..

కరోనా సమయంలో ఆక్సిజన్ కోసం ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసిన ఎమ్మెల్యే..
కాలనీలో అందుబాటులో ఉన్న పార్కు స్థలాల్లో చెట్లు పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరింపైన ఉందని, రానున్న తరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చదనం అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని PAC చైర్మన్ గాంధీ తెలిపారు..

మిత్ర హిల్స్ కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరిగినది అని, పార్క్ సమస్య కూడా త్వరలోనే పరిష్కరిస్తామని, ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా పరిష్కరిస్తామని, నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉంటాయి అని , ఎవరు అధైర్య పడకూడదు అని, పార్క్ సమస్య కు త్వరలోనే పరిష్కారం లభిస్తుంది అని PAC చైర్మన్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.

కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే అందులో PAC చైర్మన్ గాంధీ పాత్ర ఎంతో ఉందని, కాలనీ లో రోడ్లు, డ్రైనేజీ ,మంచి నీటి వ్యవస్థ ను ఏర్పాటు చేయడం జరిగినది అని, ఎమ్మెల్యే నిధులతో బూస్టర్ ను ఏర్పాటు చేసి మంచి నీటి వ్యవస్థను కల్పించడం జరిగినది అని పలువురు కాలనీవాసులు తెలియచేశారు.