న్యూఢిల్లీ : వక్ఫ్ బిల్లు సవరణలపై విచారణ చేపడుతున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ నుండి తాము వైదొలగనున్నట్లు ప్రతిపక్ష ఎంపిలు సోమవారం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. సమావేశ తేదీలు, సంప్రదింపుల కోసం సమన్లు జారీ చేసే అంశాల్లో కమిటీ అధ్యక్షుడు, బిజెపి నేత జగదాంబికా పాల్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆందోళనలను లేకుండా చేసేందుకు, వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదింప చేసేందుకు ఆయన బలవంతపు చర్యలు తీసుకుంటున్నారని ఓం బిర్లాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. చట్టంలో సవరణల మార్పు గురించి రిప్రజెంట్ ఇచ్చేందుకు తగిన సమయం ఇవ్వకపోతే కమిటీ నుండి వాకౌట్ చేస్తామని హెచ్చరించారు.
వక్ఫ్ బిల్లుకు ప్రతిపాదిత మార్పులు ఆగస్టులో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఈ బిల్లు జెపిసి కమిటీకి వెళ్లింది.