SAKSHITHA NEWS

శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని వీకర్ సెక్షన్ కాలనీ వెంకటేశ్వర్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్లు పథకం కొరకు అప్లై చేసుకున్న వారిని గుర్తించడం కోసం సిఓ పాప గౌడ్ తో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు .

కార్పొరేటర్ మాట్లాడుతూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అని దరఖాస్తుల స్వీకరించడం జరిగింది దానిలో ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు 420 అమలు చేస్తామని చెప్పి మహాలక్ష్మి పథకం, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, రైతు భరోసా పథకాల కింద అప్లై చేసుకోమని దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ప్రజాపాలన అప్లికేషన్స్ దారులు అక్కడికి 50మంది వస్తే దాదాపు 30 మంది వరకి ఇందిరమ్మ ఇండ్లు పథకంలో ఆన్లైన్లో ఎంట్రీ లేదని చెప్తా ఉన్నారు ఇవి 20 మందిలో కూడా వాళ్ళు ఐదు స్కీం లకి అప్లై చేసుకుంటే ఏదో ఒక స్కీం రెండు స్కీములు మాత్రమే ఆన్లైన్లో ఎంటర్ అయ్యి ఉన్నాయి

ఈ విధంగా మా డివిజన్లో అప్లై చేసిన వారిలో 40% కూడా ఎంట్రీ కాలేవు సంవత్సరం అయిపోతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి అసలు ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ కడుతున్నారు ఎన్ని కడుతున్నారు అన్న క్లారిటీ ప్రజలకు తెలియజేయాల్సి నా బాధ్యత ప్రభుత్వానిది. ఇప్పటికే అప్లై చేసిన ఫామ్ లో ఎంట్రీలు చేయక ప్రజలు వార్డ్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ అలాగే మీరు పెట్టిన జ్యోతిరావు పూలే ప్రజా భవన్ కి వెళ్లినా కూడా ఎవరు స్పందించడం లేదని చెప్పి ప్రజలు వాపోతా ఉన్నారు కావున ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని మంత్రులు గాని స్పందించి మరి ఎవరైతే ఆన్లైన్ ఎంట్రీ కాలేదు అప్పుడు ఎవరైతే లేనివారు ఉన్నారో వారందరికీ కూడా అవకాశం ఇచ్చి ఈ పథకాలు వాళ్ళందరకి కూడా అందించే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు మీరు కనుక వీలైనంత తొందరగా వీళ్ళకి అవకాశం ఇవ్వకపోతే వీళ్ళు అందరిని తీసుకొని ముఖ్యమంత్రి నివాసం డిప్యూటీ ముఖ్యమంత్రి నివసిస్తున్నటువంటి ప్రజా దర్బార్ కి వెళ్లి ధర్నా చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వేముల ఆంజనేయులు, జగదీష్ గౌడ్, రాజశేఖర్, రమేష్ రావు, బాబు, రవీందర్రావు, నాగార్జున, భారతి చౌదరి, తానారాం, కిషన్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS