విజయవాడలో జాతీయ రైస్ మిల్లర్స్ అసోయేషన్ సమావేశం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు సహకరించాలని కోరిన మంత్రి నాదెండ్ల
మిల్లరర్లపై మార్కెట్ సెస్ 2 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని ధరల పర్యవేక్షణ మంత్రుల సమావేశంలో చర్చించినట్లు గుర్తు చేసిన మంత్రి
బియ్యం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సహకరిస్తామని మిల్లర్ల హామీ
బియ్యం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని మంత్రికి తెలిపిన మిల్లర్లు
ఇది మంచి ప్రభుత్వం.. అందరికీ మేలు చేయాలనే కూటమి ప్రభుత్వం పని చేస్తుంది
అందరికీ మంచి రోజులే ఉంటాయి.. ఎవరికీ ఇబ్బందులు ఉండవు
దేశ వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లు అందరూ ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది
సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుంది
గ్రామీణ ప్రాంతాలలో రైస్ మిల్లులు పెట్టి.. ఎంతోమందికి ఉపాధి కల్పించిన వారు రైస్ మిల్లర్లు
దేశ వ్యాప్తంగా యూనిఫాం పాలసీ తీసుకు వచ్చే విధంగా అందరం కలిసి లోతుగా అధ్యయనం చేద్దాం
1550 రైస్ మిల్స్ నేడు ఎపీ వ్యాప్తంగా ఉన్నాయి
కోస్తాతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఉన్న రైస్ మిల్లర్లను కలుపుకుని వెళ్లాలి
బకాయిల విషయంలో గత ఐదేళ్లలో పరిపాలన ఎంత దారుణంగా జరిగిందో మీకు తెలుసు
19వేల 800కోట్లు టర్నోవర్ ఉన్న పౌరసరఫరాలశాఖలో 41వేల 150కోట్లు బకాయిలు చేసి గత ప్రభుత్వం వెళ్లిపోయింది
రుణాలు తీసుకుని రైతులకు కూడా చెల్లించకుండా వెళ్లిపోయారు
సీఎం చంద్రబాబుతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో రైతుల బకాయిల పై చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది
వారి సహకారంతో 1674కోట్ల బకాయిలు రైతులకు నెల రోజుల్లో చెల్లించాం
అదే సమయంలో రైస్ మిల్లర్స్ గురించి కూడా మేము ఆలోచన చేశాం
ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యే లోపే 283 బకాయిలు చెల్లించాం.. మరో వారం రోజుల్లో 200కోట్లు చెల్లిస్తాం
కష్టపడి పండించిన ధాన్యం వారికి నచ్చిన చోట అమ్ముకునే స్వేచ్చ రైతులకు కల్పించాం
మూడు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలు 90 శాతం మందికి… మరో 10 శాతం మందికి ధాన్యం కొనుగోలుకు సంబంధించి డబ్బులు జమ
రైతులు, మిల్లర్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులను ఏర్పాటు చేసి పారదర్శకంగా ఉండేలా కమిటీని ఏర్పాటు చేస్తున్నాం
కూటమి ప్రభుత్వంలో ప్రసంగాలు కాదు.. అండగా ఉండాలనేదే మా లక్ష్యం
నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలనే ఆలోచన చేస్తున్నాం
ఇటీవల నిత్యావరస వస్తువుల ధరలు కూడా బాగా పెరిగిపోయాయి
ప్రజలకు ధరలు తగ్గించి ఇచ్చేలా అవసరమైన చర్యలు తీసుకున్నాం
వరదల సమయంలో బాధితులకు 25కేజీల బియ్యం అందించడంలో మిల్లర్లు ఎంతో సహకారం అందించారు
గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిన వేల కోట్ల బకాయిలను ఇప్పుడు మేము చెల్లిస్తున్నాం
మార్కెట్ సెస్ రెండు శాతం ఉన్నదాన్ని ఒక శాతానికి తగ్గించడానికి నిర్ణయం
మా సబ్ కమిటీలో చర్చ పెట్టి ఒక శాతానికి తగ్గించేలా క్యాబినెట్ లో పెట్టబోతున్నాం
ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమికి పట్టం కట్టారు
మనమంతా వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు చేయాలి
పీడీయస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించేలా చర్యలు తీసుకుంటున్నాం
గతంలో స్థానికంగా జరిగే అక్రమ రవాణాను.. గత ప్రభుత్వంలో ఏకంగా ఎగుమతులు చేసే మాఫియా తయారైంది
ఇటువంటి అక్రమార్కులకు మీరంతా దూరంగా ఉండాలి, ప్రోత్సహించ వద్దు
మిల్లర్ల సమస్యలపై చర్చ చేసి.. తప్పకుండా మీ ఇబ్బందులను పరిష్కరిస్తాం
నేను మాట ఇస్తున్నా.. ప్రతి గింజ కొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
గతంలో కావాలనే కొన్ని మిల్లులకే బియ్యం కొనుగోలు అవకాశం ఇచ్చారు
ఇతర మిల్లర్లను ఉద్దేశపూర్వకంగా దెబ్బ కొట్టారు
ఎం.డి.యూ యూనిట్లు పెట్టి 1645 కోట్లు ప్రజాధనాన్ని ఉపయోగించారు
29 వేల రేషన్ షాపుల ద్వారా ప్రజలకు మంచిగా సరుకులు అందేవి
ఇంటింటికీ రేషన్ పేరుతో పెద్ద స్కాంకు తెర తీసి, దోచుకున్నారు
గోనె సంచుల విషయంలో ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశాం
ప్రజలకు, రైతులకు , మిల్లర్లకు మేలు చేయాలనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తూ ఉంటారు
పౌరసఫరాలశాఖ తరపున మీకు నేను అండగా ఉంటాను
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా పాలన చేస్తుంది
కొంతమందికి లాభం, మరికొంతమందికి నష్టం చేసే ఆలోచన మాకు ఉండదు
అందరం కలిసి అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందేలా, రాష్ట్ర అభివృద్దిలో అందరూ భాగస్వామ్యం కావాలనేదే మా ఆకాంక్ష..