భక్తి శ్రద్ధలతో శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవం….
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : రామగుండం నియోజకవర్గం 7వ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మికతతో పాటు సమాజంలో భక్తి, ఐక్యత, సత్సంబంధాలు పెంపొందించడంలో ఆలయాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఆలయ అభివృద్ధికి స్థానిక ప్రజలు, నిర్వాహకులు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే అభినందించారు. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ రమాదేవి శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST