ప్రజా సమస్యల పరిష్కారమే బీసీ పొలిటికల్ జెఎసి ఎజెండా
దశాబ్ద కాలంగా ప్రతిపక్ష పాత్రతో అవినీతిపరుల భరతం పడుతున్నాం…………
—బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
…..
సాక్షిత వనపర్తి :
ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఎజెండాగా భావించి బీసీ పొలిటికల్ జేఏసీ ముందుకు సాగుతుందని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ స్పష్టం చేశారు.
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో….మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామానికి చెందిన బి.మహేందర్ నాయుడును బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటుగా రాచాల నియమించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…. నేడు మదనపురం మండలంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా మహేందర్ నాయుడు ముందుండి ప్రజల పక్షాన పోరాటం సాగిస్తున్నాడని, ఆయన సేవలు ఒక మండలానికి పరిమితం కాకుండా జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమిస్తున్నట్లు తెలిపారు.
గత దశాబ్ద కాలంగా బీసీ పొలిటికల్ జేఏసీ నిర్వహిస్తున్న అనేక ఉద్యమాలలో మహేందర్ నాయుడు చురుకైన పాత్ర పోషించాడని అన్నారు.
గొప్ప పోరాట పటిమ కలిగిన నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంటుగా ఉంటే బీసీ పొలిటికల్ జేఏసీ మరింత బలపడుతుందనే నమ్మకంతో ఈ పదవి ఇవ్వడం జరిగిందన్నారు.
నేటినుంచి జిల్లాలోని అన్ని మండల కమిటీలు నాయకులు మహేందర్ నాయుడు నాయకత్వంలో మరింత చురుకుగా పాలుపంచుకుంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
గత దశాబ్ద కాలంగా బీసీ పొలిటికల్ జేఏసీకి ఏ విధంగా సహకరించారో మహేందర్ నాయుడుకు కూడా అదేవిధంగా ప్రోత్సహించి వెన్ను తట్టి నిలవాలని ప్రజలకు, బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు.
అన్ని ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి ప్రతిపక్ష పాత్ర పోషించడమే కాకుండా రాష్ట్రస్థాయిలో అవినీతికి పాల్పడుతున్న అధికారుల భరతం పట్టడంలో కూడా ముందు నిలుస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్ నాయకులు బాలవర్ధన్, రాములు, కురుమూర్తి, ఉదయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
