ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులకు సామాజిక భద్రత ఏది.
ఆసుపత్రి విధుల్లో ఉండగా మరణించిన ఇందిర కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలనీ.
ప్రజాసంఘాల నాయకులు డిమాండ్
వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన.
కన్నీటి అశ్రునయనాలతో ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికురాలు ఇందిర అంతిమయాత్ర.
సాక్షిత వనపర్తి ఆగస్టు 29
ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న పారిశుధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులు ఏళ్ల తరబడి పనిచేస్తు అకస్మాత్తుగా మరణిస్తే ప్రభుత్వాల నుండి ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండా మృతి చెందిన కుటుంబాలకు ఎలాంటి సామాజిక భద్రత లేక రోడ్డున పడుతున్నారని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్, ఇతర ప్రజాసంఘాల నాయకులు ధ్వజమెత్తారు.
నిన్న వనపర్తి ఎం సి హెచ్ డిపార్ట్మెంట్ లో మధ్యాహ్నం షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు ఇందిర ఆస్పత్రి మరుగుదొడ్లు శుభ్ర పరుస్తూ అపస్మారక స్థితిలో అక్కడే తుది శ్వాస విడిచిన నేపథ్యంలో ఇందిరా కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట బైఠాయించారు.
అనంతరం ఆసుపత్రి సూపరిండెంట్ ఇతర అధికారుల సమక్షంలో సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులతో చర్చలు జరిపి మృతురాలు ఇందిర కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, కుటుంబానికి ఆదుకునేందుకు ప్రభుత్వపరంగా, ఏజెన్సీ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శవ పంచనామా అనంతరం జిజిహెచ్ ప్రాంగణంలో కార్మికులు కన్నీటితో కడసారి అంతిమయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా పి.సురేష్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోష, మాజీ ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ:-వనపర్తి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో దాదాపు 25 ఏళ్లకు పైగా ఇందిరా నిర్విరామంగా రోగుల మలమూత్రాలు ఎత్తిపోస్తూ వెలకట్టలేని సేవలందించారని కొనియాడారు. దురదృష్టవశాత్తు ఆస్పత్రి మరుగుదొడ్లు శుభ్రం చేస్తూ కుప్పకూలి హాఠన్మరణం చెందడం అత్యంత విషాదకరమని అన్నారు.
ఆస్పత్రి కార్మికులు మరణిస్తే ఎలాంటి భద్రత లేదని వాపోయారు. కార్మిక మృతుల కుటుంబ పట్ల మానవత దృక్పథంతో వ్యవహరించాలని కేవలం పిఎఫ్ ఈఎస్ఐ ద్వారా మాత్రమే కొంత ఆర్థిక సాయం అందించే విధానం కొనసాగుతుందని ఇది కూడా దాదాపు మూడు సంవత్సరాల నుంచి 4 ఏళ్ళు సమయం పడుతుందని డెత్ క్లెయిమ్ కోసం బాధ్యత కుటుంబాలే తిరగాల్సి వస్తుందని అనేక మందికి ఆర్థిక స్తోమత లేక అధికారుల చుట్టూ తిరగలేక క్లెయిమ్ మంజూరు కావడం లేదని వాపోయారు.
ప్రభుత్వమైన నేరుగా మృతుల కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం 25 లక్షల అంది విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, సింగల్ విండో చైర్మన్ రఘువర్థన్ రెడ్డి,ఏఐటీయూసీ జిల్లా నేతలు శ్రీరాములు, గోపాలకృష్ణ,భాస్కర్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్,మాజీ కౌన్సిలర్ సీతా రాములు, ఆయా పార్టీల నేతలు శ్రీను, విజయ్,ఆస్పత్రి యూనియన్ బ్రాంచ్ నేతలు గంధం శ్రీనివాస్, నరసింహ, నరేందర్, కుమార్, లింగం శెట్టి, వెంకటేష్,భాస్కర్, మోహన్, భారత్,లక్ష్మి,కళావతి భాగ్యమ్మ, ప్రేమ కుమారి, సంతోషమ్మ సుజాత జయలక్ష్మీ గోవిందమ్మ, అనిత, కవితా రాణి, మంజుల, నాని తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
