SAKSHITHA NEWS

జోగుళాంబ గద్వాల్ పోలీస్

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బాదితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ఐపిఎస్

జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బాదితుల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులను ఏలాంటి ఆలస్యం లేకుండా తక్షణ పరిష్కారం అయ్యే విధంగా కృషి చెయ్యాలని సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్ఐ మరియు సిఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది.

ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని జిల్లా ఎస్పి. తెలియజేశారు. ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్పి సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ రోజు వచ్చిన పిర్యాదులలో
భూ వివాదాలకు సంబందించి -02
భర్త వేదింపులకు సంబందించి -01
గొడవకు సంబంధించి -01
ఇథనాల్ కంపెనీ ఏర్పాటు వద్దని -01
ఇతర అంశాలకు సంబంధించి -02 పిర్యాదులు రావడం జరిగింది.


SAKSHITHA NEWS