పాస్టర్లకు క్రిస్మస్ కానుక అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
క్రిస్మస్ పండుగ సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలో ఉన్న పాస్టర్లందరికి నూతన వస్త్రాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ లోక రక్షకుడు.. కరుణామయుడు.. ఏసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజున జరుపుకునే క్రిస్మస్ పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ లోని ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు కలిసిమెలిసి చేసుకోవడం ఆనందించదగ్గ విషయం అని అన్నారు. డివిజన్ లో ఉన్న క్రైస్తవ సోదర సోదరీమణులు అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, పోశెట్టిగౌడ్, గుడ్ల శ్రీనివాస్, మోజెస్, పాస్టర్స్ ఇస్రాయిల్, ఎం.రాజు, ఎం.ఎం.సురేష్, సత్యరాజు, గోపి, శ్యాముల్, నాగభూషణం, సుమన్, జాషువ తదితరులు పాల్గొన్నారు.