.నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటునివ్వండి
అభివృద్ధిలో రాష్ట్రానికి దిక్సూచిగా నరసరావుపేటను నిలుపుతా
ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే డా౹౹చదలవాడ
అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలనే కసితో పరుగులు పెడుతున్నానని,ప్రభుత్వం తరఫున తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నరసరావుపేట ఎమ్మల్యే డా౹౹చదలవాడ అరవిందబాబు విన్నవించారు.ఈ మేరకు ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు.అభివృద్ధికి మీరు రోల్ మోడల్,అదే స్ఫూర్తితో నరసరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.ఎన్నో వనరులున్న నరసరావుపేట నియోజకవర్గం గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబాటుకు గురైందని వివరించారు.అభివృద్ధికి పెద్దపీట వేసే మీ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధికి దిక్సూచిగా మార్చాలని భావిస్తున్నట్లు వివరించారు.